Salivahana Employees' Welfare Association (Regd. No. 3817/1992)
Follow us :   Membership Online

శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం ( సేవా) రెండున్నర దశాబ్దాల క్రితం స్థాపించబడి కుల బంధువుల శ్రేయస్సు, సంక్షేమం అభివృద్ధికి నిబద్ధతతో కూడిన అకుంఠిత దీక్షతో కాలక్రమేణ పరిణతి చెందుతూ సేవలందిస్తుందని తెలియ చేయుటకు ఆనందిస్తున్నాము.

పరోపకారం ఇదం జగత్ అనే సంకల్పంతో " సేవా " 1991 లో స్థాపించబడి నేడు సుమారు 800 కు పైగా శాశ్వత సభ్యులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ కుల బంధువుల,కుల సంఘాల,ప్రభుత్వాల మరియు ప్రభుత్వేతర సంస్థల ప్రశంసలు పొందుతున్నది. దీనికి ప్రధాన కారణం అది నుండి నీతి నిజాయితీ తో, క్రమశిక్షణ తో నిరంతరం సేవలందిస్తున్న "సేవా " కార్యవర్గ సభ్యులని గుర్తు చేస్తూ వారందరికీ అభినందనలు తెలియచేస్తున్నాము.

సేవా స్థాపించిన నాటి నుండి కుల బంధువులను సంఘటితం చేయుటకు ఎంతో కృషి చేసింది. అందులో ముఖ్యంగా ప్రతి సంవత్సరం చేపట్టే కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం జంట నగరాల్లోని శాలివాహనుల కుల బంధువులతో పరిచయాలు ఏర్పడటమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కుల బంధువులతో సత్సంభందాలు ఏర్పాటు చేసుకొనుటకు వేదిక అవుతుంది..

శాలివాహన ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్థాపించి ప్రతి సంవత్సరం వివిధ కోర్సులలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ,విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో నగదు ప్రోత్సాహకాలతో సత్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కుల బంధువులకు వారి పిల్లలకు ఎంతగానో ప్రేరణ కలిగించి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించుటకు తోడ్పడుతుందని తెలియ చేయుటలో ఏమాత్రం సందేహం లేదు.

శాలివాహన కులంలో వివాహ సంబంధాలు కుదుర్చడంలో కూడా "సేవా" "గణనీయమైన పాత్ర పోషిస్తున్నది.

ప్రతి సంవత్సరం సభ్యుల పేర్లు, వివరాలతో కూడిన "డైరీ" ముద్రించి విడుదల చేయడం ద్వారా సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరగడానికి "సేవా " కృషి చేస్తుంది.

"సేవా" కార్యక్రమాలను కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కులబంధువులకే పరిమితం కాకుండా ఖండాంతరాలకు వ్యాపించేలా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలే కాకుండా ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని,వ్యూహాత్మకంగా, ప్రణాళికా బద్దంగా,నూతన ఒరవడితో శాలివాహన ఉద్యోగులకు,కుల బంధువులకు ప్రతి ఒక్కరికీ ఏదో విధంగా సేవలందించాలన్నది "సేవా" సంకల్పం.

దానిలో భాగంగానే salivahana.org website ను ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రపంచంలో శాలివాహనులు ఎక్కడ ఉన్నా అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి తద్వారా శాలివాహనులను అన్ని రంగా ల్లో అభివృద్ధి బాటలో నడిపించేందుకు దోహద పడాలన్నదే మా యొక్క ఆలోచన.

"సేవా" చేపట్టిన ప్రతి కార్యక్రమానికి స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం చేస్తున్న దాతలకు, ప్రకటనల ద్వారా చేయూతనందిస్తున్న కుల బంధువులకు,మిత్రులు, తమ అమూల్యమైన సమయాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తున్న సభ్యులకు ధన్యవాదాలు

దేశంలో వివిథ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ( కుమ్మర,కులాల,శాలివాహన,ప్రజాప్రతి,, వడియార్,కుంభార్ మొదలగు) పిలువ బడుతున్న మన శాలివాహన మిత్రులు మరియూ ప్రపంచం లోని వివిధ దేశాల్లో ఉన్న మన కుల బంధువులు అందరూ కూడా ఈ website ను సద్వినియోగ పరుచుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము.

Established two and a half decades ago, the Saliwana Employees Welfare Association is pleased to announce that the well-being of the caste relatives will continue to evolve over time, with a commitment to the development of welfare.

Services

Address